బంగారుపాళ్యం మండలం వెంకటాపురం పంచాయతీ కుప్పాలపల్లి గ్రామానికి సమీపంలోని దొమ్మరోని గుడిసెల వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంతో పాటు నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. శవం నీటిలో ఉబ్బిపోవడంతో ఎప్పుడో జరిగిన ఘటన అని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.