ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న “అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025” సెమీ ఫైనల్స్ సెప్టెంబర్ 10న భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. ఈ కార్యక్రమ పోస్టర్‌ను మంగళవారం సాయంకాలం ఐదు గంటలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ సాంకేతిక రంగంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందని, విద్యార్థులు క్వాంటం టెక్నాలజీ ఆవిష్కరణలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 10న జరిగే ప్రాంతీయ సెమీఫైనల్లో పోటీలలో విజేత, రన్నరప్ జట్లు అమరావతిలో జరగబోయే గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారని అన్నారు.