తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తుందని రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మిస్తుందని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోరండ్ల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి విద్యార్థినులు 20 మందికి పైగా 510 పైన మార్కులు సాధించడం అభినందనీయం అన్నారు.నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు ఇచ్చి పాఠశాలల మరమ్మత్తులు చేపట్టిందని అన్నారు. స్కూల్ లో మరుగుదొడ్ల నిర్మాణం తన వంతు బాధ్యతగా...