ఆదోని పట్టణ టూ టౌన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఆదోని 2 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి. ఆదివారం వారు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లకు ముందస్తుగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. రాబోయే వినాయక చవితికి ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రౌడీ షీటర్లు సారాయి, మట్కా, తదితర కార్యక్రమాలకు శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.