మొలంగురులో బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు... కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు వద్ద బుధవారం సాయంత్రం బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లింగాపూర్ గ్రామానికి చెందిన రమేశ్, సురేశ్ అనే ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరిగినట్టు స్థానికులు తెలిపారు. రోడ్డు పై వెళ్లేవారు చూసి అంబులెన్స్ కి సమాచారం అందించారు.గాయపడ్డ ఇద్దరిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.