అనంతపురంలో ఈనెల 10 న జరుగునున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్నారని, సభకు మూడున్నర లక్షల మంది హాజరుకానున్నట్లు రాష్ట్రమంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అనంతపురంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన మంత్రులు నారాయణ, నరేంద్ర, ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. సమీప భవిష్యత్తులో మరిన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతున్నదన్నారు.