రేషన్ కోసం 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు చౌక దుకాణాలకు రావద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలు ఇవ్వడము అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ జగ్గంపేట మండలం గుర్రప్పాలెం 21వ రేషన్ షాప్ దుకాణం వద్ద ఇలాంటివి ఏమీ అమలులో లేవు. వృద్ధులంటే వికలాంగులు ఏంటి ఎవరైనా కూడా రేషన్ షాప్ వద్దకు వచ్చి సరుకులు తీసుకోవాల్సిందే.అయితే అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు నడవలేక అవస్థలు పడుతూ ఆదివారం రేషన్ దుకాణానికి సరుకులు తీసుకోవడానికి వచ్చింది.