దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను కోటగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో పోతంగల్ మండల కేంద్రంలో జరిగిన దొంగతనాల కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు మహిళలను కోటగిరి బస్టాండ్ వద్ద పట్టుకున్నామని చెప్పారు. వారిని విచారించి, వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.