అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలో ప్రమాదవశాత్తు వేడి నీరు పడటంతో పులివెందుల మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన లారీ క్లీనర్ దేవీపుత్రుడుకు గాయాలయ్యాయి. మంగళూరు నుంచి తాడిపత్రికి మట్టిలోడుతో వస్తున్న లారీ తాడిపత్రి సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు వరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.