బందరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మైనార్టీల నిరసన పెండింగ్లో ఉన్న ఇమామ్, మౌజామ్ ల గౌరవ వేతనాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్ వద్దనిరసన జరిగింది. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు, అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనం ఇవ్వడంలేదని వారు ఆరోపించారు.