బాపట్ల ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున అత్యుత్తమ ప్రశంసా పత్రం వరించింది. గురువారం బాపట్ల డిపోలో జిల్లా ప్రజారవాణా శాఖ అధికారి సామ్రాజ్యం ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జోన్-3 నెల్లూరు వారిచే ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం లభించిందన్నారు.