ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతి ఆదివారం సాయంత్రం తగ్గుముఖం పట్టింది. అయితే కరకట్ట సమీపంలో ఒడ్డు భారీగా కోతకు గురైన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహించడంతో ఒడ్డు కోతకు గురై ఒర్లిపోవడంతో కరకట్టకు ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, అధికారులు తాత్కాలిక మరమ్మతులు, ఇసుక బస్తాలు కరకట్టకు అడ్డుగా వేసి చేతులు దులుపుకున్నారు.