విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ జరిగిన పోరాటంలో బషీర్ బాగ్ వద్ద పోలీసు కాల్పుల్లో మరణించిన వారికి వామపక్ష పార్టీలు విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు నివాళులర్పించారు. అలాగే డి.హిరేహాల్ మండల కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జోహారులప్పించి స్మరించుకున్నారు. విద్యుత్ ఉద్యమ పోరాట స్పూర్తితో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లకు. విద్యుత్ చార్జీలువ పెంపుపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.