జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం దోబ్బలపాడు మోడల్ స్కూల్ లో సరైన వసతులు కల్పించాలని పాఠశాల ముందు కాటారం-మేడారం రహదారిపై బిజెపి మండల అధ్యక్షులు పూర్ణచందర్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మోడల్ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సరైన వసతులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ధర్నాను విరమింప చేశారు.