గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి యధావిధిగా వరద కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1,32,822 క్యూసెక్కులు వస్తుంది. 12 గేట్లు ఓపెన్ చేసి 83,074 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 36,433 క్యూసెక్కులు, నెట్టెం పాడు లిఫ్ట్ కు 750, ఎడమ కాలువకు 920, కుడికాలువ కు 500, భీమా లిఫ్ట్ -2 కు 873 క్యూసెక్కులు, మొత్తం 1,21,757 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు.