సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజా ప్రసార వ్యవస్థను గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ప్రజల కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు.