రామయంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు క్యూ లైన్ లో నిలుచున్నారు, పిల్లాపాపలను పంట పొలాలను వదిలి కుటుంబ సభ్యులు అంతా కూడా వచ్చి యూరియా కోసం క్యూలైన్లో నిల్చుంటున్నారు, కాట్రియాల, ప్రగతి ధర్మారం గ్రామాలలో యూరియా బస్తాల కోసం వందలాదిమంది క్యూలైన్లో నిల్చున్నారు, గురువారం యూరియా వస్తుందన్న విషయం తెలుసుకున్న రైతులు నుండి రైతు వేదిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బారులు తీరారు, ప్రగతి ధర్మారంలోని పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం టోకెన్లు పంపిణీ చేస్తుండడంతో రైతుల క్యూలో నిల్చున్నారు.