ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం ఉదయం నుంచి రైతులు బారులుదీరారు. యూరియా దిగుమతి కావడంతో అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో వందల సంఖ్యలో రైతులు చేరుకొని క్యూలైన్లో నిల్చున్నారు. కాగా, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది వృద్ధ రైతులు లైన్లో నిల్చోలేక ఇబ్బంది పడ్డారు. సరిపడ యూరియా దొరుకుతుందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.