నగరి నియోజకవర్గం వడమాలపేటలో సోమవారం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలకు రేషన్ సమస్యలు తలెత్తకుండా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు.