నిరుపేదలకు స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం సాయంత్రం స్థానిక తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 99, 061 స్మార్ట్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని రేషన్ దుకాణాల వద్ద డీలర్లు, సచివాల సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేయబోతున్నామని వెల్లడించారు.