జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో విశాఖపట్నంలోని ఎర్ర మట్టి దిబ్బలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ ఏడాది ఆగస్టు 27 పూర్తయింది. అధికారికంగా శుక్రవారం యునెస్కో ప్రతినిధులు ప్రకటించారు. ఈ దిబ్బలు 1500 ఎకరాల్లో విస్తరించి, 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి భూగోళ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇవి ఇసుక, సిల్ట్, మట్టి మిశ్రమంతో ఏర్పడి సహజ ఆక్సీకరణం వల్ల ప్రత్యేకమైన ఎరుపు రంగులో ఉంటాయి. పర్యాటకం, సినిమా షూటింగ్‌ల వల్ల దెబ్బతింటున్న ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు.