మైనాపురం గ్రామానికి చెందిన వీరేష్ అనే యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరేష్ గత కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో తల నొప్పి అధికమైంది. నొప్పి భరించలేక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.