నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోటలో శనివారం అర్ధరాత్రి దొంగతనాలు కలకలం రేపాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తొమ్మిది ఇళ్లలో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి బంగారం, నగదు అపహరించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డోన్ సీఐ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.