ASFలోని ఓ అదిలాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద గల పెట్రోల్ పంపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్దగల స్టోర్ రూమ్ మేనేజర్ గదిలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ పంపు వద్ద ఉన్న వాహనదారులు,సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకోవడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.