తాడిపత్రిలోకి జిల్లా ఎస్పీ జగదీష్ చేరుకున్నారు. మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్న నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు బలగాలతో ఎస్పీ జగదీశ్ బయలుదేరారు. ఎవరైనా అల్లరి సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు.