వర్షాల వల్లే యూరియాకు ఆలస్యం : మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి యూరియా సరఫరాలో ఆలస్యంపై రైతులు ఆందోళన చెందవద్దని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి శనివారం మధ్యాహ్నం తెలిపారు. భారీ వర్షాల కారణంగా వంతెనలు పాడవ్వడంతో యూరియా లోడు రావడానికి ఆలస్యం జరిగిందని అయన వివరించారు. మరో రెండు మూడు రోజుల్లో చల్మెడ గ్రామానికి యూరియా లోడ్ వస్తుందని హామీ ఇచ్చారు. త్వరలోనే రైతులకు సరిపడా యూరియాను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.