ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ నరసింగపురం గ్రామంలో మొక్కజొన్న రైతు మాదాసు సూరిబాబు(40) పరుగుల మందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు.. కుటుంబ సభ్యులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యం పొందుతూ బాధితులు గురువారం రాత్రి 9 గంటలకు మృతి చెందాడు.వర్షాలకు మొక్కజొన్న పంట తడిచి పాడైపోవడంతో మనస్థాపానికి గురి అయి రైతు ఆత్మహత్య చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..