బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి 25 వర్ధంతి పురస్కరించుకొని దేవనకొండలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దిలేటి శెట్టి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతాంగం పట్ల, పేద ప్రజానీకం పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ భవిష్యత్తులోనూ బషీర్బాగ్ ఉద్యమ తరహాలో ప్రజల సమస్యలపై పోరాడతామని తెలిపారు.