మంగళవారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా అధికారి తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అదనపు గదులు పదవ తరగతి హాజరు శాతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు పదవ తరగతిలో ఒక విద్యార్థి కూడా ఫేల్ కాకుండా గుణాత్మకమైన విద్యాబోధనలు అందించాలని ఆదేశాలిచ్చారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపాధ్యాయులు అందించే విద్యాబోధనలే మూలమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.