ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ శివ కిషోర్ పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు.. జిల్లా నలుమూలల నుంచి 45 ఫిర్యాదులు అందాయని ఎస్పీ తెలిపారు.. జిల్లా ఎస్పీ స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు విని న్యాయపరంగా విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.