చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్ లకు శిక్షణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా సందర్శించి శిక్షణ కేంద్రంలోని వివిధ సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకు కొత్త శక్తిని అందించబోయే రిక్రూట్ల శిక్షణ ప్రమాణాలు అత్యుత్తంగా ఉండేలా అన్ని విభాగాలతో తనిఖీలు చేసి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.