శనివారం కలెక్టరేట్ లోని డీ ఆర్ సి సమావేశ మందిరంలో సీఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరు సమీక్షలో అమరావతి భూ సమీకరణ పధకంలో రైతులు ఎదుర్కొనుచున్న పలు సమస్యలు మరియు పెండింగ్ లో గల ఇతర అంశములపై చర్చించి సంబంధిత అధికారులకు కమిషనర్ కె.కన్నబాబు పలు సూచనలు ఇచ్చియున్నారు. ఈ సమీక్ష లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి , సి.ఆర్.డి.ఎ. యూనిట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి మరియు సంబంధిత మండల తాహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.