ఆదోని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే జిల్లా ఏర్పాటు తప్పనిసరని జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ అన్నారు. మంగళవారం ఆదోని మున్సిపల్ మైదానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏర్పాటుతో విద్యా సంస్థలు, వ్యాపార కేంద్రాలు నెలకొని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.