ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి స్టేట్ సెక్రటరీ దేవేందర్ గౌడ్ అన్నారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం పిరమిడ్లు వేసి శాంతియుత నిరసన తెలిపారు. దేవేంద్రర్ గౌడ్ మాట్లాడుతూ.. కళాశాలకు వెళ్లకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని అట్టి వారిపై వెరిఫికేషన్ పెట్టి చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూస్షన్ పేపర్ లో 20 తప్పులు ఉన్నాయని డీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రీ వెరిఫికేషన్ చేయాలన్నారు.