ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొంది ఆర్థికంగా ఎదగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన పనుల పండుగ కార్యక్రమంలో భాగంగ శుక్రవారం కడెం మండలం ధర్మాజీపేట్,లక్ష్మీసాగర్ గ్రామాల్లో నూతనంగ నిర్మించిన కోళ్ల షెడ్డు,గొర్రెల షెడ్డులను ఎంఎల్ఏ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోళ్లు, గొర్రెలను పెంచుతున్న రైతులకు గతంలో షెడ్డు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కాని వేరే ఇతర నిధులతో కానీ వారికి నూతనంగా ప్రభుత్వమే షెడ్డులను నిర్మించి ఇస్తుందన్నారు.