దేవరకద్ర నియోజకవర్గ భూత్పూర్ మండల కేంద్రంలోని విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో బిజీ 3 పత్తి విత్తన నియంత్రణకు హెచ్.టి టెస్టులు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని వసంత్ సీడ్స్ ,సాయితేజ సీడ్స్, మావసాన్ సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లలో టెస్టులు నిర్వహించి విత్తన నిలువలు,రిజిస్టార్లు,లైసెన్సులు,టీసీలు,బీసీలు స్టాక్ వివరాలు తదితర వాటిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు,వివిధ మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.