మొదటి సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కార్యాలయం నందు చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబుకి మొదటిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు పూర్తి కావడం సంతోషకరం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.