కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఆకాంక్షిత నుండి అభివృద్ధి వైపుగా నడిపించాలని నీతి అయోగ్ సి.ఈ.ఓ. అన్నారు. బుధవారం న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని ఆకాంక్షిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సి.ఈ.ఓ. మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి వైపుగా నడిపించి ముందు వరసలో ఉంచాలని తెలిపారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో నీతి అయోగ్ ద్వారా చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.