ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు ఉండాలని రాజోలు సీఐ నరేశ్ కుమార్ సూచించారు. శనివారం ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను, నెంబర్ ప్లేట్లపై సినీ, రాజకీయ బొమ్మలు ఉన్న బోర్డులను తొలగించారు. ఆ స్థానంలో నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించి యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. నెంబర్ ప్లేట్లపై వాహనం నెంబర్ తప్ప మరే ఇతర చిత్రాలు ఉండకూడదని ఆయన హెచ్చరించారు.