Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 31, 2025
రంపచోడవరంను ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఆదివారం మధ్యాహ్నం రంపచోడవరంలో ప్రజలు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ బంధం శ్రీదేవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రంపచోడవరాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపే యోచన సరికాదని, రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. అలా ప్రత్యేక జిల్లాగా ఉంటేనే గిరిజన ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.