ఆర్మూర్ మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో తన భూమి అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు గణేష్ కబ్జా చేసి తన భూమిలోకి పోనీయకుండా అడ్డుకుంటున్నారని బాధితుడు సాయన్న దళిత సంఘాలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 2: 15 ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత సంఘాల నాయకుడు గంగాధర్ మాట్లాడుతూ ఇస్సపల్లి గ్రామంలో సాయన్న భూమిని గత 12 సంవత్సరాల నుండి గణేష్ అనే టిఆర్ఎస్ నాయకుడు కబ్జా చేసి తన భూమిలోకి వెళ్ళనీయకుండా అక్రమంగా అడ్డుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.