జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నివారణ రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పని చేయాలన్నారు.