మంత్రాలయం : నియోజకవర్గంలో తుంగభద్ర నదిపై మేళిగనూరు వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని, కుడి కాలువ ద్వారా తాగు, సాగునీరు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పురుషోత్తం రెడ్డి నీటిపారుదల కమిషనర్ రామసుందర్ రెడ్డిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ ప్రాజెక్టు త్వరగా ఆమోదించాలని కోరారు. కుడికాలువ నిర్మించి కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీరందించాలన్నారు.