రాష్ట్రంలో మద్యం బెల్టు షాపు లేని గ్రామం ఉందా అని మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలో మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నదన్నారు. ప్రభుత్వం రైతులకు యూరియాను ఇవ్వలేకపోతున్నదన్నారు. వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో యూరియా కోసం క్యూలో రైతుల నిలుచున్న ఒక్క ఫోటో అయినా చూపగలరా అని ప్రశ్నించారు కుప్పానికి నీళ్లు తీసుకుపోయారు గాని కళ్యాణదుర్గానికి ఇవ్వలేకపోయారన్నారు. రైతులకు యూరియా ఇవ్వకపోతే యూరియా గోడౌన్లపై దాడులు చేసి రైతులకు ఇస్తామన్నారు.