తక్షణమే బకాయిలు చెల్లించాలని, పిఎఫ్ బకాయిలు కట్టాలని సెనర్జీస్ కార్మికులు నిరసన.దువ్వాడ ఎస్ సి జెడ్ లో ఉన్న సెనర్జీస్ కార్మికులు గేటు ముందు నాలుగు రోజులుగా నిరసన.గత ఏడాది మూడు నెలల జీతాలు, ఏడాది నాలుగు నెలల జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆందోళన. ప్రతినెల జీతాలు చెల్లించకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని, పిల్లలను ఎలా చదివించుకోవాలని ఆవేదన.నాలుగు రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు.