మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డితో సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య భేటీ అయ్యారు. సులూరుపేట నుంచి నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి ని కలిసిన జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల జైల్లో నుంచి విడుదలైన నేపథ్యంలో మాజీ ఎమ్మెల