బీసీలకు ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన ప్రధానమైన ఐదు హామీలను నెరవేర్చాలని కోరుతూ కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుత్తుల రమణ నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి రామ్మోహన్రావుకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుత్తుల రమణ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34% అమలు చేయాలని, అలాగే బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.భారతీయ మనువాద సమాజంలో అనాదిగా సామాజిక అణిచివేతకు, ఆర్థిక దోపిడీకి గురై అన్ని విధాల వెనక్కు నెట్టబడ్డ 139 బీసీ కులాలను ఆదుకోవాలని