తార్నాకలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో లంబాడి సుగాలీలు 1956 లోనే గిరిజనులుగా గుర్తించబడ్డారని అన్నారు. కానీ నేడు లంబాడి సుగాలీలను గిరిజనులు కాదని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారని తెలిపారు. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ను తార్నాకలోని ఆయన నివాసంలో కలిసి చర్చించినట్లు మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. లంబాడీల మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ తెలిపారు.