కె.గంగవరం మండలం యర్రపోతవరం వంతెన దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలవలోకి దూసుకు వెళ్లింది. మంగళవారం ద్వారకా తిరుమల నుంచి యానాం వైపు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. డ్రైవరు, ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు చెట్టుకి ఆనుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.