తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల కోసం హైదరాబాద్ లో స్మృతివనం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశాడు. తెలంగాణలో కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర అని,సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తే బిజెపికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని వెంకటరెడ్డి హెచ్చరించారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో లో గురువారం ఘనంగా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.